Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 05
హజీపూ డలలో ఉపధ హీ పథక క ేపటట అభవృధ పులకు సబధ ఎబీ కడులు పయతీజ అధకులు సజక తఖీ అధకులకు ఎుకు అజేయడ లే జలల గీణభవృధ శఖ అధక (డీఆడీఏ) తీవ అసహ వయకత ేశు. ఈ వయవహపై ఉతధకులకు ఫయు ేసత హెు.
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రోడ్లు, మురుగు కాలువలు, బిల్డింగులకు సంబంధించిన ఎంబీ రికార్డులను సామాజిక తనిఖీ అధికారులకు ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి (డీఆర్డీఏ) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐదో విడత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికను శనివారం నిర్వహించారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను గత రెండేళ్లుగా పంచాయతీరాజ్ అధికారులు తనిఖీ అధికారులకు ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఆర్డీఏ తెలిపారు. పడ్తను పల్లి గ్రామ పంచాయతీలో తనిఖీ అధికారులకు రికార్డులను చూపించలేదని డీఆర్డీఏకు వివరించడంతో సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2025 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2026 ఆర్థిక సంవత్సరం వరకు హాజీపూర్ మండలంలో రూ. 1.45 కోట్లతో చేపట్టిన 212 పనులకు ఆడిట్ బృందం తనిఖీలు చేసిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం 'బి.బి.జి. రాంజీ'గా మార్చద్దన్నారు కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారి శివారాం, విజిలెన్స్ మేనేజర్ కిరణ్, హాజీపూర్ మండల ఇన్చార్జి ఎంపీడీవో గౌతం, ఎంఎస్ఈ ఆర్ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఐకేపీ ఏపీవో వెంకటేష్, ఎంపీఓ ఆవునూరి సుమన్, సర్పంచులు జాడి వెంకటేష్, బేతు రమాదేవి, యేసయ్య, బొడ్డు భూమన్న, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.










