భీమారం, సోమవారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఆయన సోమవారం పరిశీలించారు.
భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) భవనం నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులకు సూచించారు.
మండల పరిధిలో కొనసాగుతున్న ఐకేపీ భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, కార్యాలయ నిర్వహణకు ఐకేపీ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆదేశించారు.
పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచి, కార్మికులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి మహిళా సంఘాలకు శాశ్వత వసతులు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, రామ కార్యదర్శి స్వరూప, గ్రామ సర్పంచ్ పెద్దల రూప బాపు, మండల అధ్యక్షులు పోడేటి రవి, సర్పంచులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.












