కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీజీఎస్పీడీసీఎల్, టీజీ , బ్యాంకులు సంయుక్తంగా సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సంగారెడ్డి, పటాన్చెరువు ప్రాంతాల్లో నుంచి 4వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సౌర విద్యుత్ వినియోగం, ఇంటి పైకప్పులపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు, పథకం ప్రయోజనాలపై అధికారులు వివరించారు.
కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గృహ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని సంగారెడ్డి విద్యుత్ శాఖ ఎస్ఈ (ఆపరేషన్స్) సుధీర్ కుమార్ ప్రజలకు సూచించారు. టీజీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీ వివరాలను ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి పీఎన్బీ సహాయ మేనేజర్ కిషోర్ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం కింద బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలను వివరించారు. పథకం మార్గదర్శకాల ప్రకారం 3 కిలోవాట్ల వరకు సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకుండానే రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డీఈటీ శ్రీనివాస్, సంగారెడ్డి ఆపరేషన్స్ డీఈ నెహ్రూ నాయక్, ఏడీఈలు లక్ష్మణ్, వీరారెడ్డి, తులసీరామ్, ఏఓ అశోక్, ఏఈలు, బ్యాంకర్లు, సౌర విద్యుత్ విక్రేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.







