డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడి మోసాలపై సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అవగాహన కల్పించారు. సైబర్ జాగృకత దివస్ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడి మోసాలపై సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ నెల మొదటి బుధవారం సైబర్ జాగృకత దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో () డైరెక్టర్ శిఖా గోయల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ జాగృకత దివస్ కార్యక్రమం ద్వారా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆన్లైన్ మోసాలకు ఎవరూ అతీతులు కారని, ప్రజల అవసరాలు, అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ మోసాలు, పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఇంపర్సనేషన్ మోసాలు వంటి సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, , , , పాస్వర్డ్లు, వంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను వెల్లడించవద్దని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ సెల్ డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణ చలం, రిజిస్ట్రార్ రాజేశ్వరన్, ఎన్.ఆర్. క్యాంపస్ డిప్యూటీ డైరెక్టర్ గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












