గుడిహత్నూర్, 26 September
ఆదిలాబాద్ జిల్లా ఎస్టీయూ ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని శుభం కన్వెన్షన్, నాగోల్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు మూగ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఎస్టీయూ 80వ వసంతాల వేడుకలు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని శుభం కన్వెన్షన్, నాగోల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మూగ శ్రీనివాస్ తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మండలంలోని ఉమ్రి బి గ్రామంలో గల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ధ్రువ వసంత్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆడే రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు ఎస్. భోజన్న, ఆర్. మోహన్ తదితరులు పాల్గొన్నారు.












