సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోట్రు. రామకృష్ణ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ మనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ -2026 పురస్కారానికి ఎంపికయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ గుర్తింపు లభించింది.
28 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందిస్తున్న పోట్రు. రామకృష్ణకు విద్య, పర్యావరణ పరిరక్షణ, మానవతా సేవ, సామాజిక అవగాహన రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఆయనకు , అనే అధికారిక రికార్డు టైటిల్‌కు ఎంపిక చేసినట్లు మనం ఫౌండేషన్ ప్రకటించింది.
ఈ పురస్కారాన్ని హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళా వేదిక హాల్లో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మరియు ప్రముఖుల చేతుల మీదుగా అందుకుంటారని ఇంటర్నేషనల్ మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు, నేషనల్ చైర్మన్ డా. కె. చక్రవర్తి తెలిపారు.
ఈ అరుదైన గుర్తింపునకు రామకృష్ణ మనం ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.












