(NICU)** (అక్షరవేకువ) జూలై 10
దహగడలడైదణలడటదోచలలలైదణలచెదఒదలడలడఆసపత్ధణలలడడలడలడలడజచలడోఒటటో600గలడబోఅలడషటథలడోజచదలడలడజచలడడహటలడైదదోదలడ40ోజలడటణలషణోచచఅదచ,ఆసపత్ధణలోగగఇటచ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ గోపతి, నవజాత శిశువులు , చిన్న పిల్లల అత్యవసర వైద్య నిపుణుడిని (కన్సల్టెంట్ పీడియాట్రిషన్ & నియోనాటాలజిస్ట్). ఈ రోజు మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన రోజు. సరిగ్గా వచ్చి, అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించిన చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించి, ఈ రోజు ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నాము.
సుమారు 40 రోజుల క్రితం దహేగాం మండలానికి చెందిన ఒక దంపతులకు గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల కారణంగా అత్యవసరంగా ప్రసవం చేయాల్సి వచ్చింది. వారికి కవల ఆడపిల్లలు జన్మించారు. గర్భధారణ సమయంలో రక్తప్రసరణలో వచ్చిన సమస్యల కారణంగా ఒక పాప సాధారణంగా ఎదిగింది. అయితే మరో పాప ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయి, పుట్టినప్పుడు కేవలం 600 గ్రాముల బరువుతో అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించింది.
పుట్టిన వెంటనే ఆ పాపను మా నవజాత శిశు ఐసీయూ (NICU)లో చేర్చి వెంటనే చికిత్స ప్రారంభించాము. నాకు లండన్ ప్రముఖ నవజాత శిశు కేంద్రాల్లో దాదాపు రెండు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ నేర్చుకున్న ఆధునిక నియోనేటల్ చికిత్సా విధానాలను, మన ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలకు అనుగుణంగా ఈ చిన్నారికి అమలు చేస్తూ, మా వైద్య బృందం దాదాపు 40 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించింది.
మా వైద్య బృందం కృషితో, నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో మరియు తల్లిదండ్రుల సహకారంతో ఈ చిన్నారి చికిత్సకు ఎంతో మంచి స్పందన చూపింది. ప్రస్తుతం ఈ చిన్నారి 1 కిలో 100 గ్రాముల బరువుకు చేరుకుని, స్వయంగా పాలు తాగుతూ, ఆరోగ్యంగా ఇంటికి వెళ్లే స్థితికి చేరుకుంది.
ఈ చిన్నారి కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబానికి చెందినది. ఇలాంటి చికిత్స ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగి ఉంటే సుమారు ₹15 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉండేది. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యం ఈ చిన్నారికి పూర్తిగా ఉచితంగా చికిత్స అందించింది.
ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. చాలా తక్కువ బరువుతో లేదా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు అవసరమైన ఆధునిక నవజాత శిశు వైద్య సేవలు కేవలం హైదరాబాద్ లేదా కరీంనగర్‌లలో మాత్రమే కాకుండా, మన మంచిర్యాలలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. సరైన సమయంలో వి ఇలాంటి...












