మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 11
ఆపదో ఉననవారి పరాణాన ాపాడటమే ర మరినని సేవా ారయరమా చేపటటాితదానం అని, రతదానంపై ఉనన అపోహన తొగించని యవత మంద రావాని ఎమమెయే ొిరా పరేమ సాగర రావమంచిరయా పిపనిచచార. మంచిరయారయా ో ఆదివారం నిరవహించిన మేఘా రతదాన శిిరంో ఆయన పాగొని మాటాడార.
ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటమే రక్తదానం అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల క్లబ్లో ఆదివారం నిర్వహించిన మేఘా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, క్లబ్ సభ్యులు, రక్తదాతలను ఉద్దేశించి ప్రసంగించారు.
రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన సూచించారు. బ్లడ్ బ్యాంకుల్లో తగినన్ని నిల్వలు ఉంటే తలసేమియా, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందించవచ్చని తెలిపారు.
మంచిర్యాల క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులోనూ క్లబ్ ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పేకాట ఆడి నష్టపోయేవారి కంటే, క్లబ్లో పేకాట ఆడటం కొంత మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
భూకంపాలు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో మంచిర్యాల క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమణారావు తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను కూడా క్లబ్ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.
క్లబ్ పట్ల దుష్ప్రచారం చేయడం సరికాదని ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ విమర్శకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ధరణి మధు, కార్పొరేటర్ స్రవంతి కిషోర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో 211 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.












