అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 11
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రామ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు. జనాభా సమస్యలు, పరిష్కారాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. కుటుంబ నియంత్రణ, వివాహ వయసు, మాతృత్వ సేవలు వంటి అంశాలపై అవగాహన పెంచాలని సూచించారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రామ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, జనాభా వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు.
ముఖ్యంగా తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, కాన్పుల మధ్య దూరం, వివాహ వయసు, లింగ వివక్షత, మాతృత్వ సేవల ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహణాధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు మతిన్, శ్రీనివాసరెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ రమణ, ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












