జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టీఎన్జీవోస్ సంఘం జిల్లా నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ అలీ, జిల్లా కార్యదర్శి వేల్పూరు రవి ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నాయకులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, కలెక్టర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజాప్రయోజన కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగానికి టీఎన్జీవోస్ సంఘం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, భాస్కర్, ప్రమోద్, మోహనప్ప, జగన్, యాదవరెడ్డి, వెంకట్, శాంత కుమార్, షకీల్, విద్యదర్ గౌడ్, సుమన్, మహేష్, బీరప్ప, నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఎండీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.











