భీమారం, 2026-06-05
పోలీస్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనం నంబర్ ప్లేట్‌ను టాంపరింగ్ చేసిన పి. జంపయ్య అనే వ్యక్తిపై భీమారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ తెలిపారు.
పోలీస్ చలాన్ల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో వాహనం నంబర్ ప్లేట్‌ను టాంపరింగ్ చేసి, అసలు రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించకుండా చేసిన పి. జంపయ్య అనే వ్యక్తిపై భీమారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ తెలిపారు.
వాహనం నంబర్ ప్లేట్లో మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చలాన్లను తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను ఉద్దేశపూర్వకంగా టాంపరింగ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నంబర్ ప్లేట్‌ను మార్చడం, టాంపరింగ్ చేయడం లేదా స్పష్టంగా కనిపించకుండా చేయడం చట్టవిరుద్ధమని ఎస్ఐ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వాహనదారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వాహనదారులు తప్పనిసరిగా ప్రామాణిక నంబర్ ప్లేట్‌ను వినియోగించాలని, నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మార్పులు చేయరాదని ఎస్ఐ ఎ. రాజేందర్ సూచించారు.












