ఉట్నూరు (అక్షరవేకువ) ఆగస్టు 18
ఆ,మెొ10ెీథెెఎహపమషపపమమైమ(ఏ)మఈ,ఐఏఐ
మంచిర్యాల జిల్లా నుండి ఎంపీ వంశీ జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు మేయర్ మధుకర్ సిటీ ప్రెసిడెంట్ తూముల నరేష్ పాల్గొన్నారు ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాల కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జిల్లా ఇన్ చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సంక్షేమ పథకాలు పేదల ముంగిట చేర్చాలని సూచించారు.
ఓటర్ల జాబితా సవరణపై దృష్టి
ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణలో (సర్) మలి విడత ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
వర్గ విభేదాలు వీడాలని సూచన
కాంగ్రెస్ నేతలు వర్గ విభేదాలు వీడి, ప్రభుత్వాన్ని, పార్టీని బలోపేతం చేసే దిశగా కలిసి నడవాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు.












