దండేపల్లి, 9 September
మంచిర్యాల జిల్లా మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి దారుణ హత్య జరిగింది. వివాహిత మహిళను ఆమె బంధువు అయిన యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మహిళను గొడ్డలితో నరికి హత్యాచేసిన యువకుడు అక్షర వేకువ : మంచిర్యాల జిల్లా మండలం లోని నెల్కి వెంకటాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మహిళను మంగళవారం రాత్రి సుమారు 9:35 గంటలకు గొడ్డలితో నరికి హాత్య చేశాడు ఓ యువకుడు. గ్రామానికి చెందిన సింగతి లచ్చన్న భార్య సింగతి లక్ష్మి (45) ను లచ్చన్న పెద్దనాన్న కొడుకు సింగతి రమేష్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి వెళ్లి ఆకారణంగా గొడ్డలితో నరకగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.












