హజీపూర్, 7 September
మంచిర్యాల జిల్లా మండలం నన్నూర్ పునరావాస కాలనీలో మిగులు ప్లాట్లను గుర్తు తెలియని వ్యక్తి కబ్జా చేశారు. సుమారు 8 ప్లాట్లను అక్రమించి ఫెన్సింగ్ వేయగా, స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పునరావాస కాలనీలో ప్లాట్లు కబ్జా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడి పేట నoన్నూర్ పునరావాస కాలనీలోని మిగులు ప్లాట్లను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి కబ్జా చేశారు కాలనీలోని రోడ్ నెంబర్ 7 లోని చివరలో డంపింగ్ యార్డ్ సమీపంలో పంపిణీ చేయగా మిగిలిన ప్లాట్లను సంక్షేమ హాస్టల్ కోసం కేటాయించారు కానీ మిగిలిన ఓ 8 ప్లాట్ ను ఓ స్థానికేతరుడు అక్రమించి ఆ ఫ్లాట్ చుట్టూ ఏకంగా ఫెన్సింగ్ వేశాడు కొంతమంది యువత స్పందించి అడ్డుకోవడంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి జారుకున్నాడు ఫ్లాట్లు కబ్జా అవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు పునరావాస కాలనీలో విలువైన భూములు అన్యక్రాంతం కాకుండా అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు.












