మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 17
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్నిరసన నిరసనలిపివేసిందనిరసన ఆరోపిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కలెక్టరేట్ ముట్టడి మహిళలతో భారీ నిరసనకు దిగాయి. కలెక్టరేట్క్టరేట్ కార్యాలయం ముట్టడిందు పెద్ద ఎత్తున నిరసనరసన చేపట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. మహిళలతో కలిసి నిరసనరసన తెలుపుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై కార్డులను ప్రదర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని నిలిపివేసిందని ఆరోపిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలతో కలిసి నిరసన తెలుపుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై కార్డులను ప్రదర్శించారు.
సంక్షేమ పథకాలపై విమర్శలు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లక్షా 16 వేల కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలు వెలుగు చూశాయని అన్నారు.
తుగ్లక్ చర్యలంటూ ఆరోపణలు
కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన, తుగ్లక్ చర్యలతో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని, ప్రజలు త్వరలోనే తమ పొరపాటును తెలుసుకుంటారని, ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ను చీరి చింతకాయలు రాలగొడతారని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి పథకం అమలు జరిగే వరకు గులాబీ పోరాటం ఆగదని అన్నారు.
తీవ్ర ఆందోళనలకు పిలుపు
రాబోయే రోజుల్లో మరిన్ని తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ప్రజా మేలుకు, సంక్షేమ ఫలాలు అందేలా పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












