సంగారెడ్డి, 9 September
సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్, రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు ఆయన రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటన బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో చోటుచేసుకుంది.
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసి పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్, రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కళాశాల ఇన్స్పెక్షన్ నిర్వహించి పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు అధికారి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా గత వారం బాధితుడు రూ.30 వేలు నగదును అధికారికి అందజేశారు. మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో వల పన్నారు. బాధితుడు రూ.20 వేల నగదును ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలోని అధికారులు గోవింద్ రామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేర్కొన్నారు.












