జైపూర్, 2026-07-15
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) లో బుధవారం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు జరిగిన ఈ వేడుకకు సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) లో బుధవారం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు జరిగిన ఈ వేడుకకు సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి భవిష్యత్తుకు ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. గత పదేళ్లుగా కొత్త గనులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల ఈ గని దక్కిందని చెప్పారు. ఈ బ్లాక్ లో 400 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా, 340 మిలియన్ టన్నుల మేర జీ-9 గ్రేడ్ బొగ్గును వెలికితీసే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా రాబోయే 45 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, అలాగే 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు.
అనంతరం డైరెక్టర్ ఎం. తిరుమల రావు ఎస్టిపిపి పరిధిలో నిర్మాణంలో ఉన్న 1x800 మెగావాట్ల మూడో యూనిట్ పనులను పర్యవేక్షించారు. అందులో భాగంగా బాయిలర్, ట్రాక్ హపర్ మరియు (ఎఫ్జిడి) ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ఈ మూడో యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్లాంట్ ఈడి సిహెచ్. చిరంజీవి, జీఎం మదన్ మోహన్, ఏఐటియుసి ప్రతినిధి సత్యనారాయణ, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతులా మరియు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.











