Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 10
హాజీపూర్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో సర్వర్ల సమస్యలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు తమ అవసరాలకు నగదు పొందలేక అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో రైతులకు నగదు అవసరం మరింత పెరిగింది.
హాజీపూర్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో సర్వర్ సమస్యలు వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యల కారణంగా నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. చెల్లింపు కౌంటర్ వద్ద 'నో క్యాష్' బోర్డు తొలగించడంతో ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు, పొదుపు ఖాతాల్లోని నగదును తీసుకోవడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వృద్ధులు, మహిళలు, రైతులు ఉదయాన్నే బ్యాంకుకు చేరుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ కావడంతో పెట్టుబడుల కోసం నగదు అవసరమైన రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతూ, పనులు చేసుకోలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగదు దొరకక సతమతమవుతున్నామని వారు తెలిపారు.











