జైపూర్, 2026-07-15
ఇందారం గ్రామ పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు.
ఇందారం గ్రామ పరిషత్ ఉన్నత పాఠశాల (Z.P.S.S)ను బుధవారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా వారు పాఠశాలలోని తరగతి గదులను, వంట గదిని మరియు వాష్ రూమ్స్ (మరుగుదొడ్లు) ను పరిశీలించారు.
ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుపై, పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడారు.
మధ్యాహ్న భోజనం గురించి వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వం కేటాయించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ విద్యార్థులకు అన్ని రకాల వంటలను సక్రమంగా అందించాలని స్పష్టం చేశారు. మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ సూచించారు.












