భీమారం, 5 September
భీమారంలో ఐటీడీఏ కాలనీలో ఉన్న మన్విక్ ఫార్మసీలో కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగిది. ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు చేయిచుకున్నారు.
భీమారం లోని ఐటీడీఏ కాలనీలో ఉన్న మన్విక్ ఫార్మసీలో కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని, ఉచిత మందులను పొందారు.
డాక్టర్ ఆర్. రంజిత్ కుమార్, ఫార్మా-డి (ఆరు సంవత్సరాల డాక్టరేట్) పూర్తి చేసి, అపోలో ఆసుపత్రిలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలు అందించారు. తన వృత్తి లక్ష్యంగా స్వచ్ఛందంగా ప్రజలకు వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా, ప్రస్తుత ఆధునిక వైద్య సాంకేతికతను పల్లెటూరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో క్లినికల్ ఫార్మసీ, పేషంట్ కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నారు.
ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో తృప్తినిస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ రంజిత్ కుమార్, రిజిస్టర్డ్ క్లినికల్ ఫార్మసిస్ట్ (రిజి. నెం. 001108).












