లక్ష్మీనరసుపేట, 13 September
వైద్యో నారాయణ హరి అన్న భావంతో, మానవసేవే మాధవసేవగా భావించి రోగులకు సేవలందించాలని జాతీయ జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అన్నారు. ఆదివారం మంచిర్యాల లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో తిరుపతి హాస్పిటల్స్ ను మంచిర్యాల నగర మేయర్ మధుకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
మానవసేవే మాధవసేవ అందుకే వైద్య వృత్తి వైద్యో నారాయణ హరి అన్న భావంతో పేషెంట్లకు సేవలందించాలని తిరుపతి హాస్పటల్ ప్రారంభంలో జాతీయ జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఎఎస్ అన్నారు. ఆదివారం మంచిర్యాల లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో తిరుపతి హాస్పిటల్స్ ను మంచిర్యాల నగర మేయర్ మధుకర్ తో కలిసి ప్రారంభించారు. మంచిర్యాల ప్రజలకు సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని వైద్యులు బండారి శ్వేత తిరుపతి ల కు సూచన చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఐసియు సిటీ స్కాన్ ప్రసూతి గదులను పరిశీలించారు. మహిళలు రోగ బాధితులు కు మానవత్వాన్ని గుర్తించి వైద్యం చేయాలని తగు రీతిలో సహాయ సహకారాలు అందించి వైద్య వృత్తిని కొనసాగించాలని కేవలం డబ్బు కోసం వైద్యం చేయరాదని మనిషి జీవితంలో మచ్చ రాణించుకోవద్దని వైద్యులకు సూచనలు చేశారు. ప్రత్యేక గదులను ల్యాబ్ సెంటర్లను పరిశీలించి వైద్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మధుకర్ తో పాటు 52 డివిజన్ కార్పొరేటర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి టిపిసిసి సభ్యులు కొండ చంద్రశేఖర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ నాయకులు శ్యామ్, కో ఆప్షన్ నెంబర్ ఏ వన్ హోటల్ జుబేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












