దండేపల్లి, 2026-08-30
కార్తికేయన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఆదివారం దండేపల్లి మండలం, తాల్లపేట గ్రామంలోని హైస్కూల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ శిబిరంలో ఔషధాల పంపిణీతో పాటు గర్భిణీ మహిళలకు ప్రత్యేక చికిత్సలు, సలహాలు, సూచనలు అందిస్తామని డాక్టర్ చుంచు రాధిక కిరణ్ స్పష్టం చేశారు.
కార్తికేయన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఆదివారం దండేపల్లి మండలం, తాల్లపేట గ్రామంలోని హైస్కూల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది.
ఈ శిబిరంలో ఔషధాల పంపిణీతో పాటు గర్భిణీ మహిళలకు ప్రత్యేక చికిత్సలు, సలహాలు, సూచనలు అందిస్తామని డాక్టర్ చుంచు రాధిక కిరణ్ స్పష్టం చేశారు. రక్తహీనత నిర్ధారణ పరీక్షలు, ఆహార నియమాలపై రోగులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని దండేపల్లి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలపై తక్షణ వైద్య సహాయం అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.












